TTD: పరకామణి కేసు... మరో ఎఫ్ఐఆర్ నమోదుపై ఏపీ హైకోర్టు కీలక సూచన

TTD Parakamani Case AP High Court Key Suggestions on FIR
  • పరకామణి భద్రతకు ఏఐని అమలు చేయడంపై హైకోర్టును నివేదిక ఇచ్చిన టీటీడీ
  • ఈ పత్రాలపై మరింత పర్యవేక్షణ అవసరమన్న హైకోర్టు
  • తదుపరి విచారణ రేపటికి వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు ఏపీ హైకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా... టీటీడీ అధికారులు కీలక నివేదిక సమర్పించారు. పరకామణి భద్రతకు సంబంధించి ఏఐ టెక్నాలజీని అమలు చేయడం సాధ్యమేనా, దాని ప్రయోజనాలు, సాంకేతిక పరీక్షలు, సమాచార విశ్లేషణ పైలట్ మోడల్స్ వంటి వివరాలతో సమగ్ర రిపోర్టును హైకోర్టుకు అందజేశారు. 


ఈ నివేదికను పరిశీలించిన కోర్టు, మరిన్ని వివరాలు, మరింత పర్యవేక్షణ అవసరమని చెప్పి, విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ కేసును వేగవంతం చేయాలని హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. 


మరోవైపు, పరకామణి చోరీకి సంబంధించి మరో ఎఫ్‌ఐఆర్ నమోదు అంశంపై సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించాలని సీఐడీ, ఏసీబీ అధికారులకు హైకోర్టు సూచించింది. ఈ క్రమంగా ఈ కేసులో మరిని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

TTD
Tirumala Tirupati Devasthanam
Parakamani
AP High Court
Andhra Pradesh
Theft Case
CID
ACB
AI Technology

More Telugu News