Donald Trump: సహకరించకపోతే టారిఫ్‌ల మోత.. భారత్‌కు ట్రంప్ మరోసారి వార్నింగ్

Trump threatens tariff hike on India if it doesnt cooperate on Russian oil
  • రష్యా చమురు విషయంలో భారత్‌కు ట్రంప్ హెచ్చరిక
  • భారత్‌తో వాణిజ్య చర్చలతో ఈ అంశాన్ని ముడిపెట్టిన ట్రంప్
  • మోదీ హామీ ఇచ్చారన్న వాదనను గతంలోనే ఖండించిన భారత్
భారత్‌తో వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు విషయంలో సహకరించకపోతే, భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు పెంచే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఓ బహిరంగ సభలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.

"రష్యా చమురు విషయంలో భారత్ మాకు సహాయం చేయకపోతే, మేము వారిపై టారిఫ్‌లు పెంచగలం" అని ట్రంప్ అన్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలతో ఈ అంశాన్ని ఆయన ముడిపెట్టారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో భారత్-రష్యా ఇంధన సంబంధాల చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

గతంలో కూడా రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించారు. అయితే, ట్రంప్ వాదనలను భారత ప్రభుత్వం అప్పట్లోనే తోసిపుచ్చింది. ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య అలాంటి చర్చ ఏదీ జరగలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు మరోసారి ట్రంప్ ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం.
Donald Trump
India
Tariffs
Russia oil
Trade relations
Narendra Modi
US India trade
Import duties
Energy imports
Geopolitics

More Telugu News