Vijay: నటుడు విజయ్, రాహుల్ గాంధీ మంచి మిత్రులు: టీవీకే పార్టీ అధికార ప్రతినిధి

Actor Vijay and Rahul Gandhi are good friends says TVK party spokesperson
  • టీవీకే, కాంగ్రెస్ కూటమి పొత్తుకు సంకేతాలు ఇచ్చిన అధికార ప్రతినిధి
  • మతతత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో రెండు పార్టీల విధానాలు ఒకేలా ఉంటాయని వ్యాఖ్య
  • ఆ కోణంలో కాంగ్రెస్, టీవీకే భాగస్వాములన్న ఫెలిక్స్ గెరాల్డ్
తమ పార్టీ అధినేత, నటుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మంచి మిత్రులని టీవీకే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ తెలిపారు. రానున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే, కాంగ్రెస్ కూటమి ఏర్పాటుకు కసరత్తులు జరుగుతున్నాయని, ఇందుకోసం కాంగ్రెస్ అగ్రనేతలతో టీవీకే అధ్యక్షుడు విజయ్ చర్చిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఫెలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌తో పొత్తుకు సంకేతాలు ఇచ్చారు. లౌకికవాదం, మతతత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో టీవీకే, కాంగ్రెస్ పార్టీ విధానాలు ఒకే విధంగా ఉంటాయని అన్నారు. ఆ కోణంలో చూస్తే తాము భాగస్వాములమని అన్నారు. విజయ్, రాహుల్ గాంధీ కూడా మంచి మిత్రులని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీవీకే పొత్తుకు చాలా అవకాశాలు ఉన్నప్పటికీ, ఇరువర్గాలు కొన్ని విషయాలపై చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు.

పొత్తు ప్రతిష్ఠంభనకు తమిళనాడు కాంగ్రెస్ పార్టీయే కారణమని అన్నారు. ఇక్కడి నేతలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీవీకేతో కలవడానికి వెనుకడుగు వేస్తున్నారని ఆరోపించారు. ఇరుపార్టీల మధ్య పొత్తు కుదిరితే మైనారిటీ, బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా కాపాడుకోవచ్చని అన్నారు.
Vijay
TVK party
Rahul Gandhi
Tamil Nadu election
Congress alliance
Felix Gerald
Tamil Nadu politics

More Telugu News