RBI: మార్చి నాటికి రూ.500 నోట్లను ఉపసంహరించుకుంటారా?: కేంద్రం ఏం చెప్పిందంటే?

RBI Denies 500 Rupee Note Withdrawal Rumors
  • ఆర్బీఐ ఏటీఎంలలో రూ.500 నోట్లను నిలిపివేస్తుందని ప్రచారం
  • ఆ ప్రచారంలో వాస్తవం లేదన్న పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం
  • ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదన్న కేంద్రం
ఈ ఏడాది మార్చి నాటికి ఏటీఎంల నుంచి రూ.500 నోట్లను ఉపసంహరిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో రూ.500 నోట్లను నిలిపివేస్తుందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం 'ఎక్స్' వేదికగా తెలియజేసింది.

రూ.500 నోట్ల ఉపసంహరణ గురించి ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని, ఆ నోట్లు చెలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది. రూ.500 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించింది. అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది.
RBI
Reserve Bank of India
500 Rupee Note
500 Note Withdrawal
Fake News
PIB Fact Check

More Telugu News