Virat Kohli: కొత్త సంవత్సరంలో విరాట్ కోహ్లీ మొదటి పోస్ట్

Virat Kohli First Post in New Year With Anushka Sharma
  • భార్య అనుష్క శర్మతో దిగిన ఫొటోను షేర్ చేసిన స్టార్ క్రికెటర్
  • సెలబ్రేషన్స్ ఎమోజీని జత చేసిన విరాట్ కోహ్లీ
  • కొన్ని గంటల్లోనే సుమారు 6 లక్షల లైక్స్
నూతన సంవత్సరం సందర్భంగా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫొటోకు సెలబ్రేషన్స్ ఎమోజీని జత చేశాడు. ఈ చిత్రంలో కోహ్లీ నీలి రంగు ఫార్మల్ దుస్తుల్లో ఉండగా, అనుష్క శర్మ నలుపు రంగు దుస్తులు ధరించింది.

ఎటువంటి క్యాప్షన్ లేకుండా కేవలం సెలబ్రేషన్ ఎమోజీతో ఫోటోను పంచుకున్నాడు. కోహ్లీ ఈ ఫోటొను పంచుకున్న కొన్ని గంటల్లోనే దాదాపు ఆరు లక్షల లైక్స్ వచ్చాయి. కోహ్లీ, అనుష్కల ప్రేమ ఒక వాణిజ్య ప్రకటన సమయంలో మొదలైంది. 2017 డిసెంబరులో వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2021లో వారికి కుమార్తె జన్మించగా, 2024లో కుమారుడు జన్మించాడు. 
Virat Kohli
Anushka Sharma
Virat Anushka photo
New Year 2024
Kohli New Year Post
Celebration Photo

More Telugu News