Kalyan Chakravarthy: 39 ఏళ్లపాటు సినిమాలకి దూరంగా ఉన్నది ఇందుకే: సీనియర్ నటుడు కల్యాణ్ చక్రవర్తి
- 1980లలో హీరోగా వరుస సినిమాలు
- 'లంకేశ్వరుడు' తరువాత వచ్చిన గ్యాప్
- బాధ్యతలే అందుకు కారణమన్న కల్యాణ్ చక్రవర్తి
- రాజారెడ్డి పాత్ర నచ్చిందని వెల్లడి
- మంచి సినిమా చేసినందుకు హ్యాపీగా ఉందని వ్యాఖ్య
కల్యాణ్ చక్రవర్తి .. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో. ఒక వైపున బాలకృష్ణ తన దూకుడును కొనసాగిస్తూ ఉండగానే, మరో వైపున కల్యాణ్ చక్రవర్తి తన ప్రత్యేకతను చాటుతూ వెళ్లారు. 1980లలో వరుస సినిమాలతో సందడి చేసిన ఆయన, ఆ తరువాత చాలా సైలెంట్ గా సినిమాల నుంచి పక్కకి తప్పుకున్నారు. 39 ఏళ్ల తరువాత తిరిగి ఇప్పుడు 'ఛాంపియన్' సినిమాతో రీ ఎట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన రాజారెడ్డి అనే కీలకమైన పాత్రను పోషించారు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ .. " ఇంతకాలం పాటు నేను సినిమాలు చేయకపోవడానికి కారణం నేను తీసుకున్న గ్యాప్. నేను 'లంకేశ్వరుడు' సినిమా చేస్తున్న సమయానికే నాన్నగారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. అప్పటివరకూ ఆయన చూస్తూ వచ్చిన వ్యాపార వ్యవహారాలను .. కుటుంబ వ్యవహారాలను నేను దగ్గరుండి చూసుకోవలసి వచ్చింది. అందుకోసం పూర్తి సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి. అందుకే ఇక సినిమాలను పక్కన పెట్టాను" అని అన్నారు.
"నాన్నగారి మాట కాదనలేకే సినిమాల్లోకి వచ్చాను. ఆయన తరువాత వచ్చిపడిన బాధ్యతల కారణంగా సినిమాలకి దూరమయ్యాను. 'ఛాంపియన్' సినిమా కోసం స్వప్నగారు నన్ను అడిగినప్పుడు కూడా కుదరదనే చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి మరీ కథ వినిపించారు. రాజారెడ్డి పాత్ర .. తెలంగాణ నేపథ్యం .. రజాకార్ల కాలం .. ఇలా కథలో అనేక విశేషాలు ఉండటం వలన ఒప్పుకున్నాను. ఒక మంచి టీమ్ తో కలిసి ఒక మంచి సినిమా చేశాను అనిపించింది" అని చెప్పారు.