Naveen Polishetty: మెగాస్టార్‌కు నేను వీరాభిమానిని: నవీన్‌ పోలిశెట్టి

Naveen Polishetty I am a huge fan of Megastar Chiranjeevi
  • ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన హీరో నవీన్ 
  • చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారన్న నవీన్ పోలిశెట్టి 
  • ఎంతోమంది హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారంటే దానికి కారణం మెగాస్టారేనని వెల్లడి
  • ఆడియన్స్ ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమా చూసి తమ సినిమాకు వస్తారని ఆకాంక్షించిన నవీన్
మెగాస్టార్ చిరంజీవికి తాను వీరాభిమానినని హీరో నవీన్ పోలిశెట్టి పేర్కొన్నారు. నవీన్ హీరోగా, దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది.

చిత్ర ప్రచారంలో భాగంగా ‘అనగనగా ఒక రాజు పెళ్లి రిసెప్షన్’ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో నవీన్.. సంక్రాంతికే వస్తున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’తో పోటీపై మీడియా ప్రశ్నించగా, మెగాస్టార్ పై తన అభిమానాన్ని వెల్లడించారు.

సామాన్య కుటుంబంలో పుట్టినవారు కూడా స్టార్‌గా ఎదగవచ్చని చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని, ఈరోజు తన లాంటి ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారంటే దానికి కారణం మెగాస్టారేనని పేర్కొన్నారు. ఆడియన్స్ అందరూ ఆయన నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూసి తమ సినిమా చూడటానికి వస్తారని అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఆయనకు వీరాభిమానినని చెప్పుకున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చిత్రీకరించిన 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, నవీన్ హీరోగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న థియేటర్లలో విడుదల అవుతోంది. 
Naveen Polishetty
Chiranjeevi
Anaganaga Oka Raju
Manasantha Varanadhi
Meenakshi Chaudhary
Telugu Movies
Sankranti Release
Anil Ravipudi
Telugu Cinema
Movie Promotions

More Telugu News