Shreya Prasad: బెంగళూర్ నుంచి హైదరాబాద్ వచ్చేశా.. ప్రశాంతంగా ఉంటున్నా: టెకీ వైరల్ పోస్ట్

Software Engineer Shreya Prasad Finds Peace After Moving to Hyderabad
  • ట్రాఫిక్ గోల లేదు, తడిసి మోపెడయ్యే ఖర్చులు లేవు..
  • గంటల తరబడి క్యాబ్ ల కోసం వేచి ఉండాల్సిన అవసరమూ తప్పిందన్న టెకీ
  • తను తీసుకున్న నిర్ణయాల్లో ఇదే బెస్ట్ నిర్ణయమని వెల్లడి
బెంగళూరు నుంచి హైదరాబాద్ కు మారిపోయాక జీవితం ప్రశాంతంగా ఉందని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చెప్పారు. మానసికంగా, శారీరకంగా ప్రశాంతత లభించిందని, ఈ ఏడాది తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇదొకటని ఆమె తెలిపారు. రోడ్ల మీద గుంతలు, ట్రాఫిక్ ఇబ్బందులు, గంటల తరబడి క్యాబ్ ల కోసం ఎదురుచూడటాలు, నాణ్యత లేని ఆహారం తినాల్సిన బాధ తప్పిందని చెప్పారు. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ లో ఖర్చులు కూడా భారీగా తగ్గాయని ఆమె పేర్కొన్నారు. ఉబెర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రేయ ప్రసాద్ లింక్డిన్ లో చేసిన పోస్టు ప్రకారం..

హైదరాబాద్ వచ్చేశాక జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యంగా, సంతోషంగా గడిచిపోతోందని శ్రేయ తన పోస్టులో వివరించారు. ప్రొఫెషనల్ జీవితం విషయానికి వస్తే బెంగళూరు తనకు ఎంతో ఇచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే, హైదరాబాద్ తనకు వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం నేర్పిందని అభిప్రాయపడ్డారు. ప్రొఫెషనల్ గా ఎదగడమంటే ఉన్నత పదవుల్లోకి వెళ్లడం మాత్రమే కాదని, కొన్నిసార్లు పనిచేసే ప్రాంతంలో మార్పులు కూడా అని చెప్పారు. 

ట్రాఫిక్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ హైదరాబాద్ చాలా బాగుందని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారడంతో నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఏ విధంగా చూసుకున్నా బెంగళూరు కన్నా హైదరాబాద్ చాలా బెటర్ అని, అందుకే తాము ఆరేళ్ల క్రితమే సిటీకి వచ్చేశామని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
Shreya Prasad
Hyderabad
Bangalore
Software Engineer
LinkedIn Post
Traffic
Cost of Living
Work Life Balance
Uber
Relocation

More Telugu News