Durandhar: బాక్సాఫీస్ బద్ధకాన్ని వదిలించిన 'దురంధర్'

Durandhar Movie Update
  • 250 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన 'దురంధర్'
  • భారీ తారాగణంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్   
  • ఇండియాలోనే 700 కోట్లకి పైగా రాబట్టిన సినిమా 
  • 24 రోజులలో వెయ్యి కోట్లకి పైగా వసూళ్లు
  • ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లను రాబట్టిన కంటెంట్

ఈ మధ్య కాలంలో పబ్లిక్ ఎక్కువగా మాట్లాడుకున్న బాలీవుడ్ సినిమా 'దురంధర్' అనే చెప్పాలి. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతూ దూసుకెళుతోంది. ఇండియాలో 700 కోట్లకి పైగా నెట్ వసూళ్లను రాబట్టిన తొలి బాలీవుడ్ సినిమాగా ఒక అరుదైన రికార్డును ఈ సినిమా సొంతం చేసుకుంది.

యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, 24 రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ఇంతకుముందు కొన్ని సినిమాలు నమోదు చేసిన రికార్డులను ఒక్కొక్కటిగా దాటుకుంటూ వెళుతోంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కూడా ఒక అరుదైన ఘనతను దక్కించుకుంది. బాలీవుడ్ లో ఇంతవరకూ భారీ వసూళ్లను సాధించిన సినిమాల జాబితాలో 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 'క్రిస్మస్' సెలవులు కూడా ఈ సినిమాకి కలిసొచ్చాయని అంటున్నారు.

'దురంధర్' .. 250 కోట్లతో నిర్మితమైన సినిమా. టైటిల్ దగ్గర నుంచే ఆడియన్స్ లో ఆసక్తిని రేపడం మొదలైంది. అలాగే ఎంచుకున్న యాక్షన్ కంటెంట్ ను తెరపై ఆవిష్కరించిన విధానం కూడా ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. ఇక భారీ తారాగణం .. ఆ పాత్రలను మలచిన తీరు కూడా ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. జనవరి చివరి వారంలో ఈ సినిమా ఓటీటీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

Durandhar
Ranveer Singh
Aditya Dhar
Bollywood movie
Box office collection
Action thriller
Indian cinema
Highest grossing movie
OTT release

More Telugu News