Revanth Reddy: ఈ రాత్రి తిరుమలకు వెళుతున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy Visiting Tirumala Tonight
  • కుటుంబ సమేతంగా తిరుమలకు వెళుతున్న రేవంత్
  • రాత్రికి పద్మాతి అతిథిగృహంలో బస చేయనున్న సీఎం
  • రేపు తెల్లవారుజామున వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోనున్న రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్నారు. ఈ రాత్రి రేవంత్ తన కుటుంబంతో ప్రత్యేక విమానంలో శంషాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంటకు చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు చేరుకుని, పద్మావతి అతిథిగృహంలో విశ్రాంతి తీసుకుంటారు. రేపు తెల్లవారుజామున వైకుంఠ ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకుని, అనంతరం రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 


మరోవైపు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. జనవరి 8వ తేదీ వరకు టీటీడీ ప్రత్యేక దర్శనాల కోసం కేవలం టోకెన్స్ ఉన్న భక్తులను మొదటి మూడు రోజులు అనుమతిస్తుంది. ఆ తర్వాత టికెట్, టోకెన్స్ కలిగిన భక్తులతో పాటు సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా కూడా భక్తులు దర్శనం చేసుకోవచ్చు.

రేపు ఉదయం 5 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ దర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటలకు స్వర్ణరథంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో ఉత్సవ మూర్తుల దర్శనం కల్పించబడుతుంది.

Revanth Reddy
Telangana CM
Tirumala
Vaikunta Ekadasi
Sri Venkateswara Swamy
TTD
Padmavathi Guest House
Renigunta
Vaikunta Dwaram

More Telugu News