అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువతుల మృతి
- కాలిఫోర్నియా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం
- కడియాల భావన, పుల్లఖండు మేఘన దుర్మరణం
- మృతుల స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా గార్ల మండలం
ఉన్నత విద్య, ఉద్యోగాల నిమిత్తం వారు అమెరికాకు వెళ్లారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అక్కడి స్థానిక అధికారులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగపోయారు. వారి రోదన స్థానికులను కలచివేస్తోంది.