Siraj: తమిళనాడులో దారుణం: వలస కార్మికుడిపై మైనర్ల అటాక్.. వీడియో తీస్తూ వేటకొడవళ్లతో దాడి!

Siraj Attacked by Minors in Tamil Nadu Viral Video Surfaces
  • తిరువళ్లూరు జిల్లాలో సిరాజ్ అనే వలస కార్మికుడిపై నలుగురు మైనర్ల దాడి
  • కదులుతున్న రైలులో వేటకొడవళ్లతో బెదిరించి.. ఆపై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడి
  • దాడిని మొబైల్‌లో రికార్డ్ చేయడమే కాకుండా.. విక్టరీ సింబల్ చూపిస్తూ ఉన్మాదం
  • ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సిరాజ్
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సిరాజ్ అనే వలస కార్మికుడిపై నలుగురు బాలురు కత్తులు, వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ అమానవీయ ఘటనను నిందితులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. కదులుతున్న రైలులోనే నిందితులు సిరాజ్‌ను ఆయుధాలతో బెదిరిస్తూ భయపెట్టారు. ఆ తర్వాత అతడిని రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వేటకొడవళ్లతో దారుణంగా నరికారు. ఈ దాడి చేస్తున్న సమయంలో ఒక నిందితుడు ఏమాత్రం భయం లేకుండా కెమెరా వైపు విక్టరీ సింబల్ చూపించడం వారి ఉన్మాదానికి పరాకాష్ఠగా నిలిచింది.

ప్రస్తుతం సిరాజ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వైరల్ వీడియో ఆధారంగా తిరువళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు మైనర్లు కావడంతో, ఈ దారుణానికి వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Siraj
Tamil Nadu
Migrant worker attack
Tiruvallur
Crime
Minors
Viral video
Madhya Pradesh
Knife attack
Hate crime

More Telugu News