Jagadish Reddy: తంతే బూరెల బుట్టలో పడ్డట్లు రేవంత్ సీఎం అయిండు: జగదీశ్ రెడ్డి

Jagadish Reddy Slams Revanth Reddys Comments on KCR
  • గల్లీ స్థాయి లీడర్ నని నిరూపించుకున్నాడని మండిపాటు
  • కేసీఆర్ స్థాయి కాదని గుర్తుంచుకోవాలంటూ వార్నింగ్
  • ఇతరుల చావు కోరుకోవడమనేది రండ గాళ్లు చేసే పనంటూ ఘాటు వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని దిగజార్చుతున్నారంటూ రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. ‘తంతే బూరెల బుట్టలో పడ్డట్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.. ఆ పదవిని కించపరిచేలా చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోవనే విషయం గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డికి ఆయన వార్నింగ్ ఇచ్చారు.

ఈమేరకు జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నువ్వు రండవు అని అనడం మాకూ వచ్చు, నీకు ఒక భాష మాత్రమే తెలుసు కానీ మాకు అన్ని భాషలు వచ్చు. మేం కూడా నీ భాషలో మాట్లాడగలం. కానీ మేము నీలాగ మాట్లాడడం లేదు. నీ నోరు కంపు అని, సీఎం స్థాయికి తగవని, గల్లీ స్థాయి నాయకుడివని మరోమారు నిరూపించుకున్నావు. ఇతరుల చావు కోరుకోవడం రండగాళ్లు చేసే పని. వచ్చే జనరల్ ఎన్నికల్లో ప్రజలే నిన్ను బండరాళ్లు కట్టి మూసీలో పడేస్తారు” అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Jagadish Reddy
Revanth Reddy
KCR
BRS
Telangana Politics
Telangana CM
Political Controversy
Telangana Elections
Moosi River
Telangana News

More Telugu News