AP CID: కంబోడియా సైబర్ ముఠా గుట్టురట్టు చేసిన ఏపీ సీఐడీ

Cyber crime gang busted in Andhra Pradesh with Cambodia links
  • పశ్చిమ బెంగాల్ లో అంతర్జాతీయ నేరస్తుడి అరెస్ట్
  • విశాఖ, బెంగాల్‌, ఒడిశా కేంద్రంగా సిమ్‌ బాక్స్‌ కేంద్రాలు
  • 1400 సిమ్‌ కార్డుల స్వాధీనం
కంబోడియా దేశం నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా నెట్ వర్క్ ను ఏపీ సీఐడీ పోలీసులు ఛేదించారు. ఏపీలోని విశాఖపట్నంతో పాటు బెంగాల్, ఒడిశా కేంద్రంగా నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు చెందిన నేరస్తుడిని పశ్చిమ బెంగాల్ లో అరెస్టు చేశారు.

డైరెక్టరేట్ ఆఫ్‌ టెలి కమ్యూనికేషన్‌ సహకారంతో ఈ ఆపరేషన్‌ నిర్వహించినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. నిందితుడి దగ్గరి నుంచి 1400 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, బెంగాల్‌, ఒడిశాలలో సిమ్‌ బాక్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
AP CID
Cambodia cyber crime
cyber fraud
Visakhapatnam
West Bengal
Odisha
cyber crime network
SIM cards
cyber police
telecommunications

More Telugu News