Asim Munir: ఆసిమ్ మునీర్ పై పాక్ ప్రతిపక్ష నేత సంచలన వ్యాఖ్యలు

Asim Munir Criticized by Pakistani Opposition Leader
  • ఆఫ్ఘన్ పై సైనిక దాడులను ఖండించిన మౌలానా ఫజ్లూర్
  • మన దాడులను మనం సమర్థించుకుంటే... పాక్ పై దాడులను భారత్ సమర్థించుకుంటుందని వ్యాఖ్య
  • పాక్ దాడుల్లో చాలా మంది ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందారన్న ఫజ్లూర్
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పై ఆ దేశ ప్రతిపక్ష నేత, జమియత్ ఉలేమా ఇ ఇస్లాం పార్టీ నాయకుడు మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పాక్ పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దాడులపై ఫజ్లూర్ మాట్లాడుతూ... ఆఫ్ఘనిస్థాన్ లోని శత్రువులపై పాకిస్థాన్ సైనిక దాడులను మనం సమర్థించుకుంటే, పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని భారత్ నిర్వహించిన దాడులను ఆ దేశం కూడా సమర్థించుకుంటుందని అన్నారు. 

ఆఫ్ఘన్ పై పాక్ నిర్వహించిన సైనిక దాడులను ఆయన ఖండించారు. పాక్ దాడుల్లో చాలా మంది ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ లోని మా శత్రువులపై దాడి చేశామని మీరు చెబితే... పాక్ లోని బవల్పూర్ లోని ఉగ్రవాడులపై దాడి చేశామని భారత్ చెప్పుకుంటుందని అన్నారు.
Asim Munir
Pakistan
Pakistan Army
Maulana Fazlur Rehman
Operation Sindoor
India
Afghanistan
Terrorism

More Telugu News