MK Bhatia: ఆరుగురు ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చిన ఛండీగఢ్ వ్యాపారి
- కార్లను బహుమతిగా ఇచ్చిన ఔషధ తయారీ సంస్థ యజమాని ఎం.కే. భాటియా
- దీపావళి సందర్భంగా 51 మంది సిబ్బందికి కార్లను బహుమతిగా ఇచ్చిన భాటియా
- సంస్థలో పని చేసే ఆరుగురికి సర్‌ప్రైజ్ ఇచ్చిన యజమాని
చండీగఢ్‌కు చెందిన 'మిట్స్ నేచురా లిమిటెడ్' ఔషధ తయారీ సంస్థ యజమాని ఎంకే భాటియా తన కంపెనీలో పనిచేసే ఆరుగురు ఉద్యోగులకు కొత్త కార్లను బహుమతిగా ఇచ్చారు. ఇదివరకే ఆయన దీపావళి సందర్భంగా 51 మంది సిబ్బందికి కార్లను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. తాజాగా, తన సంస్థలో పనిచేసే మరో ఆరుగురికి ఆయన ఆశ్చర్యకరమైన బహుమతిని అందజేశారు.
ఉద్యోగులకు కార్లను అందజేసిన సందర్భంగా భాటియా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ తమ రంగాల్లో ధురందర్ (నిపుణులు) కావాలని పిలుపునిచ్చారు. నిరంతర అభ్యాసం, ఆత్మవిశ్వాసం, నిజాయితీతో వృత్తిలో రాణించాలని సూచించారు. వ్యాపార వృద్ధి ముఖ్యమే అయినప్పటికీ, సమాజానికి సానుకూల సందేశాన్ని ఇవ్వడం సంస్థ యొక్క ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. భాటియా గత కొన్నేళ్లుగా దీపావళి సందర్భంగా ఉద్యోగులకు కొత్త కార్లను బహుమతిగా ఇస్తున్నారు.