Kandula Durgesh: సినిమా టికెట్ల రేట్లపై కీలక సమావేశం.. ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ ఏమన్నారంటే..!

AP Minister Kandula Durgesh on Cinema Ticket Rates
  • సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులతో కందుల దుర్గేశ్ సమావేశం
  • అప్పటికప్పుడు ధరలు పెంచుకోకుండా సమగ్ర విధానాన్ని తీసుకొస్తామన్న మంత్రి
  • ప్రతిసారి రేట్లు పెంచడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని వ్యాఖ్య
భారీ బడ్జెట్ తో తెరకెక్కే చిత్రాలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రీమియర్ షోలకు, టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు ప్రభుత్వ ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సినిమా విడుదల అయ్యేటప్పుడు అప్పటికప్పుడు టికెట్ ధరలు పెంచుకోకుండా, ఒక సమగ్ర విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఇటు సినీ పరిశ్రమకు, అటు ప్రేక్షకులకు న్యాయం జరిగేలా టికెట్ రేట్లు ఉండేలా చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. 

సినిమా విడుదలైన ప్రతిసారి రేట్లు పెంచడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని దుర్గేశ్ తెలిపారు. ప్రతిసారి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఒకే జీవో ఉండేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్ పై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
Kandula Durgesh
AP Minister
AP Government
Cinema Ticket Rates
Tollywood
Movie Ticket Prices
Andhra Pradesh
Ticket Price Hike
Movie Industry
Government Officials

More Telugu News