AP Government: ఏపీలో ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే

AP Government to Conduct Comprehensive Family Survey from Month End
  • సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ప్రయోజనాల అమలు కోసం సమగ్ర కుటుంబ సర్వే
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
  • సర్వే నిర్వహణ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగింత
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రయోజనాల అమలు కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వే ద్వారా కుటుంబాలు, పౌరుల వివరాలను సమగ్రంగా సేకరించి, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోనున్నారు.
 
ఈ సర్వే ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, నివాస పరిస్థితులు, ఆదాయం, ఉపాధి, విద్య, ఆరోగ్య సమాచారం వంటి అంశాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. సేకరించిన డేటాను ఆర్‌టీజీఎస్ డేటా లేక్‌లో భద్రపరిచి, భవిష్యత్ విధాన నిర్ణయాలకు వినియోగించనున్నారు.
 
సర్వే నిర్వహణ బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించారు. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేపడతారు. జిల్లా కలెక్టర్లు, ప్లానింగ్, ఆర్టీజీఎస్ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం అమలవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెలాఖరు నుంచి సర్వే ప్రారంభమై, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 
AP Government
Andhra Pradesh
Samagra Kutumba Survey
Family Survey
Welfare Schemes
Poverty Eradication
RTGS Data Lake
Village Secretariats
Ward Secretariats
Digital Survey

More Telugu News