Bhanu Chander: ఒకప్పుడు యాక్షన్ హీరో.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోవ‌డంతో అంతా షాక్!

Bhanu Chander Then and Now Transformation Shocks Fans
  • 70–80లలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా భానుచందర్
  • ‘నిరీక్షణ’ సినిమాతో కెరీర్‌లో కీలక మలుపు
  • ఆ త‌ర్వాత హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన వైనం
  • వృద్ధాప్య లుక్‌తో నెట్టింట‌ వైరల్ అవుతున్న సీనియ‌ర్ హీరో
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో ఒకప్పుడు యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు భానుచందర్. వరుస సూపర్ హిట్ చిత్రాలతో హీరోగా ఆయన తనదైన స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. హీరోగా కెరీర్ పీక్‌లో ఉన్నప్పటికీ, ఆ త‌ర్వాత‌ సహాయక పాత్రలకు మారి కూడా తన నటనా ప్రతిభను నిరూపించుకున్న అరుదైన నటుల్లో ఆయన ఒకరు.

1978లో విడుదలైన ‘మన ఊరి పాండవులు’ చిత్రంతో భానుచందర్ సినీ ప్రయాణం మొదలైంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత ‘బెబ్బులి’,  ‘వంశ గౌరవం’, ‘ఇద్దరు కిలాడీలు’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, ‘సత్యం శివం’,‘మెరుపు దాడి’, ‘రేచుక్క’, ‘పున్నమి రాత్రి’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ కథలతో తెరకెక్కిన సినిమాల్లో ఆయన నటన అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటించి అక్కడ కూడా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించారు.

భానుచందర్ కెరీర్‌లో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన చిత్రం 1986లో విడుదలైన ‘నిరీక్షణ’. ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా లభించాయి. అయితే, కాలక్రమేణా హీరోగా వరుస ఫ్లాపులు ఎదురవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. అయినప్పటికీ, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తండ్రి పాత్రలు, కీలక సహాయక పాత్రలతో తన అనుభవాన్ని తెరపై అద్భుతంగా చూపించారు.

తాజాగా 71 ఏళ్ల వయసులో భానుచందర్ ఫొటోలు వృద్ధాప్య లుక్‌లో కనిపిస్తూ నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు పవర్‌ఫుల్ యాక్షన్ హీరోగా కనిపించిన ఆయనను ఇప్పుడు ఈ రూపంలో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.  
Bhanu Chander
Bhanu Chander actor
Telugu cinema
Tamil cinema
action hero
Nireekshana movie
Mana Voori Pandavulu
Telugu movies
character artist

More Telugu News