Donald Trump: బహిరంగ సభలో భార్య లోదుస్తుల గురించి ప్రస్తావించిన ట్రంప్!
- నార్త్ కరోలినా ర్యాలీలో మెలానియా అండర్ గార్మెంట్స్ గురించి ట్రంప్ వ్యాఖ్యలు
- రాజకీయ ప్రసంగం మధ్యలో ఈ వ్యాఖ్యలు చేయడంతో అందరూ షాక్
- తనపై జరుగుతున్న విచారణలు అన్యాయమని చెప్పే క్రమంలో నోరు జారిన అధ్యక్షుడు
రాజకీయ సభల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడటం డొనాల్డ్ ట్రంప్‌కు అలవాటే. కానీ, తాజాగా నార్త్ కరోలినాలో జరిగిన ర్యాలీలో ఆయన తన భార్య మెలానియా ట్రంప్ లోదుస్తుల గురించి మాట్లాడి అందరినీ విస్మయానికి గురిచేశారు. రాజకీయ ప్రసంగం మధ్యలో అకస్మాత్తుగా ఈ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
2022 ఆగస్టులో ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం 'మార్-ఎ-లాగో'పై ఎఫ్‌బీఐ జరిపిన సోదాల గురించి ఆయన ఈ సభలో ప్రస్తావించారు. ఆ సమయంలో ఫెడరల్ ఏజెంట్లు తన భార్య మెలానియా క్లోసెట్ (అలమర) మొత్తాన్ని గాలించారని ట్రంప్ ఆరోపించారు. ‘‘ఏజెంట్లు ఆమె సామాన్లన్నీ వెతికారు. అక్కడ ఆమె లోదుస్తులు చాలా పద్ధతిగా, పర్ఫెక్ట్‌గా మడతపెట్టి ఉన్నాయి. బహుశా ఆమె వాటిని ఐరన్ చేస్తారనుకుంటా" అంటూ వ్యాఖ్యానించారు. తనపై జరుగుతున్న విచారణలు అన్యాయమని చెప్పే క్రమంలో ట్రంప్ ఈ వింత పోలికలను వాడటం గమనార్హం.
అదే సభలో ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా మాట్లాడారు. తమ హయాంలో ద్రవ్యోల్బణం తగ్గిందని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఉద్యోగ కల్పనలో రికార్డు సృష్టించామని చెప్పుకొచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడానికి, సామాన్యుడిపై భారం తగ్గించడానికి తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. అలాగే మందుల ధరలను తగ్గించడంపై కూడా దృష్టి సారించామన్నారు.
నార్త్ కరోలినాలోని ఫర్నిచర్ పరిశ్రమను కాపాడటానికి విదేశీ వస్తువులపై సుంకాలను విధించడాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికా తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలని ఆయన పిలుపునిచ్చారు. ముందున్న 2026 మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులను గెలిపించాలని ట్రంప్ ఓటర్లను కోరారు. నార్త్ కరోలినాలో రిపబ్లికన్ పార్టీ పట్టు సాధించాలని, దానికి మద్దతుదారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఉత్సాహపరిచారు. రాజకీయ అంశాల కంటే కూడా మెలానియా వ్యక్తిగత వస్తువులపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హైలైట్ అవుతున్నాయి.