YS Jagan Mohan Reddy: నేడు పులివెందులకు జగన్ ..మూడు రోజులు అక్కడే

YS Jagan to Visit Pulivendula for Three Days
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుండి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం బెంగళూరు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అనంతరం, అక్కడ వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

రేపు (బుధవారం) ఉదయం 10:30 గంటలకు పులివెందుల నుండి ఇడుపులపాయకు చేరుకుని ప్రార్థనా మందిరంలో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకుని వినతులు స్వీకరిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

గురువారం ఉదయం 8:30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 10:20 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 10:30 గంటలకు హెలీకాఫ్టర్ లో బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. 
Go Back to Shorts
YS Jagan Mohan Reddy
Pulivendula
YSRCP
Andhra Pradesh
Idapulapaya
Christmas Celebrations
Public Grievances
Bhakarapet
CSI Church
Andhra Pradesh Politics

More Telugu News