Pavan Kumar Reddy: అమెరికాలో గుండెపోటుతో నల్గొండ యువకుడు మృతి

Pavan Kumar Reddy Nalgonda youth dies of heart attack in USA
  • ఎంఎస్ కోసం అమెరికా వెళ్లిన మేళ్ల దుప్పలపల్లికి చెందిన పవన్ కుమార్ రెడ్డి
  • శుక్రవారం స్నేహితులతో సరదాగా గడిపిన పవన్ కుమార్ రెడ్డి
  • శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి
అమెరికాలో నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లికి చెందిన పవన్ కుమార్ రెడ్డి (24) అమెరికాలో మృతి చెందాడు. శుక్రవారం అతను స్నేహితులతో సరదాగా గడిపాడు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

పవన్ కుమార్ రెడ్డి రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఒక కంపెనీలో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో రెండో నెలల్లో ఎంఎస్ పూర్తి చేసుకోనున్నాడు. ఇలాంటి సమయంలో చిన్న వయస్సులో అతను గుండెపోటుతో మృతి చెందడంతో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Pavan Kumar Reddy
Nalgonda
USA
Heart Attack
Student Death
MS Degree
Part Time Job
America

More Telugu News