Aadi Saikumar: ఆది ఫోన్ చూస్తుండటంతో స్టేజ్‌పైనే సాయికుమార్ ఆగ్రహం!

Aadi Saikumar Scolded by Sai Kumar for Using Phone on Stage
  • క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'శంబాల'
  • ఆది సరసన హీరోయిన్ గా నటించిన అర్చన అయ్యర్
  • ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ తాజా చిత్రం ‘శంబాల’ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. యుగంధర్ మునీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మహీధర్ రెడ్డి, అన్నాభీమోజు నిర్మించారు. ఆది సరసన అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇటీవల చిత్రబృందం విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. భయంకరమైన సన్నివేశాలతో పాటు ఆసక్తికరమైన కథతో సినిమా రూపొందినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. క్రిస్మస్ సందర్భంగా సినిమా విడుదల అవుతుండటంతో, చిత్రబృందం ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.


ఈ ఈవెంట్‌కు పలువురు టాలీవుడ్ యువ హీరోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు సాయికుమార్ మాట్లాడుతూ, హీరో కిరణ్ అబ్బవరంను ఉద్దేశించి ప్రశంసలు కురిపించారు. అయితే అదే సమయంలో స్టేజ్‌పై ఉన్న ఆది సాయికుమార్ (తన కుమారుడు) ఫోన్ చూస్తూ ఉండడంపై... 'ఫోన్ పక్కన పెట్టి ఇలా రా' అని పిలిచారు.


“నేను మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ చూడడం ఏంటి?” అంటూ సాయికుమార్ గట్టిగా హెచ్చరించడంతో, ఆది ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సాయికుమార్ తీరును సమర్థిస్తుండగా, మరికొందరు ఇది సరదాగా జరిగిన ఘటనగా అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ఈ వీడియో ఇప్పుడు ‘శంబాల’ సినిమాకు అదనపు పబ్లిసిటీగా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Aadi Saikumar
Shambala Movie
Sai Kumar
Telugu cinema
Kiran Abbavaram
Movie promotions
Viral video
Tollywood
Pre-release event
Archana Iyer

More Telugu News