Shivarajkumar: మళ్లీ నీ చేయి పట్టుకుంటానో లేదో అనిపించిందని నా భార్యతో చెప్పా: శివరాజ్ కుమార్

 Shivarajkumar recalls cancer surgery experience
  • క్యాన్సర్ నుంచి బయటపడ్డ శివరాజ్ కుమార్
  • అమెరికాలో ట్రీట్మెంట్ సమయంలో భావోద్వేగానికి గురయ్యానని వెల్లడి
  • యోగక్షేమాల కోసం ఎవరు ఫోన్ చేసినా కళ్లలో నీళ్లు తిరిగేవన్న కన్నడ స్టార్
క్యాన్సర్ మహమ్మారి నుంచి ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ బయటపడ్డ సంగతి తెలిసిందే. క్యాన్సర్ సర్జరీ జరిగిన నాటి రోజులను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు. తాను మళ్లీ తిరిగొస్తానని అనుకోలేదని చెప్పారు. తన తాజా చిత్రం '45' ప్రమోషన్స్ లో భాగంగా ఆయన చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ... గత డిసెంబర్ లో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లానని... ఆ సమయంలో తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. సర్జరీ అయిన ఐదారు గంటల తర్వాత స్పృహలోకి వచ్చానని తెలిపారు. మళ్లీ నీ చేయి ఇలా పట్టుకుంటానో లేదో అనిపించిందని తన భార్యతో చెప్పానని వెల్లడించారు. సర్జరీ తర్వాత ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత ఎంతో ఎమోషనల్ అయ్యానని... తన యోగక్షేమాల గురించి ఎవరు ఫోన్ చేసినా కళ్లలో తిరిగేవని చెప్పారు. డబ్బు సంపాదించొచ్చు కానీ, ప్రేక్షకుల అభిమానాన్ని పొందడం కష్టమని అన్నారు.

'45' సినిమా ఈ నెల 25న కన్నడలో, జనవరి 1న తెలుగులో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి కీలక పాత్రలు పోషించారు.
Shivarajkumar
Kannada actor
Cancer surgery
45 movie
Upendra
Raj B Shetty
Surgical treatment
Kannada cinema
Telugu release
Press meet

More Telugu News