Nara Lokesh: ఫస్ట్ క్రష్ గురించి ఓ విద్యార్థి ప్రశ్న... ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన నారా లోకేశ్

Nara Lokesh Shares Interesting Video of Student Question About First Crush
  • రాజమండ్రిలో 'హలో లోకేశ్' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
  • మీ ఫస్ట్ క్రష్ ఎవరంటూ ఓ విద్యార్థి అడిగిన ప్రశ్న
  • నా మొదటి, చివరి క్రష్ బ్రహ్మణియేనని చెప్పిన లోకేశ్
  • సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో జరిపిన ఓ ముఖాముఖి కార్యక్రమం ఆసక్తికరంగా మారింది. ఓ విద్యార్థి అడిగిన వ్యక్తిగత ప్రశ్నకు లోకేశ్ ఇచ్చిన సమాధానం, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఆసక్తికర సంభాషణకు సంబంధించిన వీడియోను లోకేశ్ స్వయంగా ఈరోజు పంచుకున్నారు.

వివరాల్లోకి వెళితే, మంత్రి నారా లోకేశ్ నిన్న రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన 'హలో లోకేశ్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి, "సార్, ఒక ఫ్రెండ్‌గా అడుగుతున్నా.. మీ ఫస్ట్ క్రష్ ఎవరు?" అని ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు లోకేశ్ నవ్వుతూ, "నా జీవితంలో నా మొదటి, చివరి క్రష్ నా భార్య బ్రహ్మణియే. దయచేసి నువ్వు ఎలాంటి చిచ్చు పెట్టొద్దురా నాయనా" అంటూ సరదాగా బదులిచ్చారు. లోకేశ్ సమాధానంతో అక్కడున్న విద్యార్థులందరూ ఒక్కసారిగా కేరింతలతో హోరెత్తించారు. విద్యార్థులతో రాజకీయ, సామాజిక అంశాలతో పాటు ఇలాంటి వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ లోకేశ్ వారితో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు. 
Nara Lokesh
Nara Brahmani
AP Minister
Hello Lokesh
Rajahmundry
Government Arts College
First Crush
Student Interaction
Andhra Pradesh Politics

More Telugu News