Anantapur Road Accident: కారును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం .. ఇద్దరు మృతి

Anantapur Road Accident Two Killed in Car Collision
  • కారును ఢీకొట్టి వెళ్లిపోయిన గుర్తుతెలియని వాహనం
  • ఘటనాస్థలంలోనే ఇద్దరు మృతి
  • మంత్రాలయం వెళ్తుండగా జరిగిన దుర్ఘటన
అనంతపురం జిల్లాలో తీవ్ర రోడ్డు ప్రమాదం సంభవించింది. పామిడి పట్టణం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఒక కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది.

వివరాల్లోకి వెళితే, కర్ణాటక రాష్ట్రంలోని చిక్ బళ్లాపూర్ నుండి కొందరు వ్యక్తులు కారులో మంత్రాలయం బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు పామిడి పట్టణంలోని దాబా వద్దకు చేరుకోగానే, అతి వేగంగా వచ్చిన మరో వాహనం బలంగా ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు. మృతుల వివరాలు, ప్రమాదంపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. 
Anantapur Road Accident
Anantapur
Road Accident
Pamidi
National Highway 44
Mantraalayam
Chikballapur
Andhra Pradesh
Karnataka

More Telugu News