Tejveer Singh: పరీక్షలో చీటింగ్ అడ్డుకున్నందుకు ఎన్.ఎస్.జి కమాండో హత్య.. 11 ఏళ్ల తర్వాత ఏడుగురికి జీవిత ఖైదు
- పరీక్షలో చీటింగ్‌ను అడ్డుకున్నందుకు దారుణం
- దశాబ్ద కాలం తర్వాత ఏడుగురు నిందితులకు శిక్ష
- 2013లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిన ఘటన
- తీర్పుపై మృతుడి కుటుంబ సభ్యుల సంతృప్తి
పరీక్షలో చీటింగ్ చేయడాన్ని అడ్డుకున్నందుకు ఓ ఎన్ఎస్‌జీ కమాండోను కాల్చి చంపిన కేసులో దాదాపు 11 ఏళ్ల తర్వాత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ స్థానిక కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
2013 మార్చిలో ముర్వార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్న తేజ్‌వీర్ సింగ్ (26) అనే ఎన్ఎస్‌జీ కమాండో సెలవుపై తన సొంత గ్రామానికి వచ్చారు. తన బావమరిది ఇంటర్ పరీక్ష రాస్తుండగా, ఆయన పరీక్షా కేంద్రం బయట వేచి ఉన్నారు. ఆ సమయంలో గ్రామ ప్రధాన్ అయిన రామ్ ప్రకాశ్ తన కుమారుడికి బయట నుంచి సమాధానాలు అందిస్తుండడాన్ని తేజ్‌వీర్ గమనించి అడ్డుకున్నారు.
దీంతో ఆగ్రహానికి గురైన రామ్ ప్రకాశ్ తన కుటుంబ సభ్యులు, బంధువులను పిలిపించాడు. నిమిషాల వ్యవధిలో తుపాకులు, ఇతర ఆయుధాలతో అక్కడికి చేరుకున్న వారు వాగ్వాదానికి దిగారు. ఈ ఘర్షణలో తేజ్‌వీర్‌పై కాల్పులు జరపగా ఆయనతో పాటు ఉన్న కుల్‌దీప్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తేజ్‌వీర్ ప్రాణాలు కోల్పోయారు.
ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఎనిమిది మందిని దోషులుగా తేల్చింది. వారిలో ఏడుగురికి జీవిత ఖైదు, మరొకరికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. విచారణ సమయంలో నిందితులందరూ బెయిల్‌పై బయట ఉండగా, తీర్పు అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసు విచారణ జరుగుతుండగానే ప్రధాన నిందితుడు రామ్ ప్రకాశ్, గాయపడిన కుల్‌దీప్ మరణించారు.
కోర్టు తీర్పుపై తేజ్‌వీర్ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. తేజ్‌వీర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మరణం తర్వాత భార్య ప్రీతి దేవికి సశస్త్ర సీమా బల్ (SSB)లో ఉద్యోగం కల్పించారు.