AP Inter Exams: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో మార్పు... నాలుగు పరీక్షలకు కొత్త తేదీలు

AP Inter Exams Schedule Revised New Dates Announced
  • హోలీ, రంజాన్ పండుగల నేపథ్యంలో తేదీల సవరణ
  • మార్చి 3, 20 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా
  • కొత్త టైం టేబుల్‌ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. హోలీ, రంజాన్ పండుగల దృష్ట్యా కొన్ని పరీక్షల తేదీలను సవరిస్తూ ఇంటర్ బోర్డు శుక్రవారం కొత్త టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఈ మార్పుల ప్రకారం మొత్తం నాలుగు పరీక్షల తేదీలు మారాయి.

వివరాల్లోకి వెళితే, 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 3న (హోలీ) జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్-2ఏ, సివిక్స్ పేపర్-2 పరీక్షలను మార్చి 4వ తేదీకి వాయిదా వేశారు. అదేవిధంగా, మార్చి 20న (రంజాన్) నిర్వహించాల్సిన ప్రథమ సంవత్సరం అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1 పరీక్షలను మార్చి 21కి మార్చారు.

మిగిలిన పరీక్షలన్నీ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా జరుగుతాయని బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.

ప్రభుత్వం ప్రకటించిన 2026 సెలవుల జాబితాను అనుసరించి ఈ మార్పులు చేసినట్లు బోర్డు తెలిపింది. సవరించిన టైం టేబుల్‌ను విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని, దానికి అనుగుణంగా పరీక్షలకు సిద్ధం కావాలని అధికారులు సూచించారు.
AP Inter Exams
AP Inter Exams 2026
Inter Exam Dates
AP Inter Board
Andhra Pradesh Intermediate Exams
Holi
Ramzan
AP Education

More Telugu News