Divya Pillai: ఊహించని మలుపులతో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ .. ఓటీటీలో!

Andhakaara Movie Update
  • మలయాళంలో రూపొందిన 'అంధకార'
  • ప్రధానమైన పాత్రలో దివ్య పిళ్లై 
  • 2024లో థియేటర్లకు వచ్చిన సినిమా 
  • అవయవాల అక్రమ రవాణా చుట్టూ తిరిగే కథ
  • అడుగడుగునా ఉత్కంఠను రేకెత్తించే కంటెంట్  
     
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు దాదాపు అన్ని భాషల్లోను తెరకెక్కుతూ ఉంటాయి. అయితే ఈ జోనర్ పై మలయాళ మేకర్స్ కి కాస్త పట్టు ఎక్కువేనని చెప్పాలి. అందువల్లనే మలయాళంలో ఈ జోనర్ నుంచి ఒక సినిమా ఓటీటీకి వస్తుందంటే ఇతర భాషా ప్రేక్షకులు సైతం చాలా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాంటి ఒక సినిమా ఇప్పుడు 'సన్ నెక్స్ట్' ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరే 'అంధకార'. 

దివ్య పిళ్లై ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, 2024 - ఫిబ్రవరిలో థియేటర్లకు వచ్చింది. కొన్ని కారణాల వలన ఈ సినిమా చాలా ఆలస్యంగా ఓటీటీ దిశగా కదిలింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'సన్ నెక్స్ట్' వారు దక్కించుకున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు. వాసుదేవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో,  సుధీర్ కరముని, వినోద్ సాగర్, చందూనాథ్, ధీరజ్, ఆంటోని హేన్రి ముఖ్యమైన పాత్రలను పోషించారు.     

అవయవాల అక్రమ రవాణాకు పాల్పడే ఒక లేడీ డాక్టర్ చుట్టూ తిరిగే కథ ఇది. ఆ కిలాడీ డాక్టర్ తాను చేస్తున్న ఈ పని కోసం, దివ్యాంగుడైన ఒక టాక్సీ డ్రైవర్ ను ఉపయోగించుకుంటూ ఉంటుంది. మరో ముఠాకి తాను దొరికిపోయే సమయం రాగానే, ఆ టాక్సీ డ్రైవర్ ను ఇరికిస్తుంది. ప్రమాదకరమైన ఆ గ్యాంగ్ ను, దివ్యాంగుడైన ఆ టాక్సీ డ్రైవర్ ఎలా ఎదుర్కొన్నాడనేది కథ. అనుక్షణం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సినిమాను, క్రైమ్ థ్రిల్లర్ కథలను ఇష్టపడేవారు చూడొచ్చు. 

Divya Pillai
Andhakaara
Malayalam crime thriller
Sun NXT
OTT release
Organ trafficking
Crime thriller movies
Malayalam movies 2024
Sudheer Karamana
Vasudevan movie

More Telugu News