Gulivindala Lavanya: గాజువాక వైసీపీ నేతల మధ్య గొడవ... మహిళా కార్పొరేటర్‌కు గాయాలు
- గాజువాక వైసీపీ సమావేశంలో వర్గపోరు
- మహిళా కార్పొరేటర్ లావణ్యపై తోటి నేతల దాడి
- తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స
వైసీపీలోని అంతర్గత విభేదాలు హింసాత్మకంగా మారాయి. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన పార్టీ సమావేశంలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో 58వ వార్డు కార్పొరేటర్ గుళివిందల లావణ్యపై తోటి నేతలే దాడి చేయడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మాజీ ఎమ్మెల్యే మల్లా విజయ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమావేశంలో మాటామాటా పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కార్పొరేటర్ లావణ్య, ఆమె తండ్రి కృష్ణపై అదే పార్టీకి చెందిన వంగ శ్రీను, సత్యనారాయణ రెడ్డి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లావణ్యను సమీపంలోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
కొంతకాలంగా స్థానిక నాయకత్వ ఆధిపత్యం, టికెట్ల కేటాయింపుల వంటి విషయాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని, ఆధిపత్య పోరులో భాగంగానే ఈ దాడి జరిగిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. సొంత పార్టీ సమావేశంలోనే ఒక మహిళా కార్పొరేటర్‌పై దాడి జరగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
ఈ ఘటనపై కార్పొరేటర్ వర్గీయుల ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వంగ శ్రీను, సత్యనారాయణ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పార్టీకి నష్టం కలిగించే ఇలాంటి ఘటనలపై అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి.