Bandi Saroj Kumar: నా తల్లిదండ్రులనే నేను పట్టించుకోను: నటుడు బండి సరోజ్ కుమార్

Bandi Saroj Kumar Interview
  • నటుడిగా .. దర్శకుడిగా బండి సరోజ్ కుమార్
  • చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమని వెల్లడి
  • తన ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయని వివరణ 
బండి సరోజ్ కుమార్ నటుడిగా .. దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుతూ ముందుకు వెళుతున్నాడు. ఆయన నటనను .. ఎంచుకునే కథలను ఒక వర్గం ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు. తాజాగా ఆయన సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన 'మోగ్లీ'లో ఒక కీలకమైన పాత్రను పోషించాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ తో బండి సరోజ్ కుమార్ బిజీగా ఉన్నాడు. 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను పంచుకున్నాడు. 

"నేను చాలా అందంగా ఉంటాను .. ఎవరో ఒకరు నన్ను హీరోను చేస్తారు అనే ఆలోచనలో ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం ఉండేది. అందువల్లనే ఈ వైపుకు వచ్చాను. మార్కెట్ ఉన్న హీరోలతోనే సినిమాలు చేయాలని తెలుసుకున్నాను. కానీ వర్కౌట్ కాకపోవడంతో నేనే హీరోగా మారాను. నిజం చెప్పాలంటే నా సక్సెస్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అదే నన్ను ఇక్కడి వరకూ తీసుకుని వచ్చింది" అని అన్నాడు.

" నా పర్సనల్ విషయాలను గురించి నేను మాట్లాడదలచుకోలేదు. నాకు మా పేరెంట్స్ తో ఎలాంటి సంబంధం లేదు. వాళ్లను గురించి నేను ఆలోచన చేయను. నా గురించి వాళ్లు ఆలోచిస్తారని నేను అనుకోను. చిన్నప్పటి నుంచి నేను ఇంతే.. 'నేనేంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడమేంటి? రిచ్ ఫ్యామిలీలో కదా పుట్టాలి?' అనుకునేవాడిని. సినిమాతో తప్ప ఎవరితోను నేను టచ్ లో ఉండను. సినిమాపై తప్ప నాకు మరి దేనిపైనా వ్యామోహం ఉండదు" అని చెప్పాడు. 

Bandi Saroj Kumar
Mogali Movie
Telugu Actor
Sandeep Raj Director
Telugu Cinema
Tollywood
Movie Promotions
Suman TV Interview

More Telugu News