child abuse: ఏడేళ్ల బాలికపై దారుణం.. కిరాతకంగా ప్రవర్తించిన వ్యక్తి

Gujarat Man Ram Singh Arrested for Brutal Assault on Minor
  • రక్తమోడుతూ కనిపించిన బాలికను ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు
  • గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లాలో ఘోరం
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ముగ్గురు పిల్లల తండ్రి అయినప్పటికీ తన కూతురు వయసున్న బాలిక పట్ల కిరాతకంగా వ్యవహరించాడు. కుమార్తె కోసం గాలించిన తల్లిదండ్రులకు నిర్మానుష్య ప్రాంతంలో రక్తమోడుతూ కనిపించిందా బాలిక.. దీంతో హుటాహుటిన కుమార్తెను ఆసుపత్రికి తరలించి, పోలీసులను ఆశ్రయించారు. ఈ దారుణం వివరాలు..
 
రాజ్ కోట్ జిల్లా అట్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో వీధిలో ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను రామ్ సింగ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. అత్యాచారం చేసి, ఓ ఇనుప రాడ్డును బాలిక ప్రైవేట్ పార్టుల్లోకి చొప్పించాడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. పొలం నుంచి తిరిగొచ్చిన బాలిక తల్లిదండ్రులు.. బాలిక కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు.

నిర్మానుష్య ప్రాంతంలో రక్తమోడుతూ స్పృహ కోల్పోయిన స్థితిలో కుమార్తె కనిపించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది టీమ్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. సుమారు 140 మంది అనుమానితులను స్టేషన్ కు పిలిచి ప్రశ్నించారు. ఈ నేరంతో సంబంధంలేని మిగతా వారిని వదిలేయగా 10 మంది మిగిలారు. వారి ఫొటోలను బాలికకు చూపించి ప్రశ్నించగా.. నిందితుడిని బాలిక గుర్తించింది. దీంతో రామ్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు.
child abuse
rape
minor girl
crime news
Ram Singh
Gujarat
Rajkot
Atkot police station
sexual assault
India

More Telugu News