Revanth Reddy: చైనాలోని ఆ ప్రావిన్స్ ను స్ఫూర్తిగా తీసుకున్నాం: గ్లోబల్ సదస్సులో రేవంత్ రెడ్డి

Revanth Reddy Inspired by Chinas Guangdong for Telangana Development
  • కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్న ముఖ్యమంత్రి
  • 2047 నాటికి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామన్న ముఖ్యమంత్రి
  • 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేది మా ఆశయమని వెల్లడి
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ్వాంగ్‌డాంగ్ రెండు దశాబ్దాల్లోనే అత్యధిక పెట్టుబడులు సాధించిందని తెలిపారు. 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'లో ఆయన మాట్లాడుతూ, కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. 2047 నాటికి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని అన్నారు. తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేది తమ ఆశయమని అన్నారు.

పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలను, అభిప్రాయాలను స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని, దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలనేది తమ ఆశయమని అన్నారు. లక్ష్యం పెద్దది అయినప్పటికీ కష్టపడితే అసాధ్యమేమీ కాదని అన్నారు. అందరి సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తెలంగాణ కల సాకారమైందని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలోనే తెలంగాణ కొత్త రాష్ట్రమని, దేశ జనాభాలో 2.9 శాతమే ఉన్నప్పటికీ, 5 శాతం ఆదాయం ఇస్తున్నామని అన్నారు. ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించామని అన్నారు. వాటిని సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు కేటాయించామని అన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా పిలుచుకుంటున్నామని అన్నారు.

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా ముందుకు వెళుతున్నామని అన్నారు. అది 20 ఏళ్లలోనే అత్యధిక పెట్టుబడులు సాధించిందని వెల్లడించారు. ఇక్కడ కూడా గ్వాంగ్‌డాంగ్ నమూనాను అమలు చేయదలిచామని అన్నారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలు మాకు ఆదర్శమని అన్నారు.

మహాత్మా గాంధీ, అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy
Telangana
Guangdong
China
Global Summit
Telangana economy

More Telugu News