Janhvi Kapoor: 'ది గర్ల్‌ఫ్రెండ్' తప్పకుండా చూడాల్సిన సినిమా.. రష్మికను మెచ్చుకున్న జాన్వీ కపూర్

Rashmika Mandanna The Girlfriend Movie Praised by Janhvi Kapoor
  • రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాన్ని మెచ్చుకున్న జాన్వీ కపూర్
  • రష్మిక నటనకు ఫిదా అయిన జాన్వీ.. ఇన్‌స్టాలో ప్రత్యేక పోస్ట్
  • ప్రస్తుతం రామ్ చరణ్‌తో 'పెద్ది' సినిమాలో నటిస్తున్న జాన్వీ
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్'‌ను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని ఆమె సూచించారు.

ఈ మేరకు జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాలోని ఓ కీలక సన్నివేశాన్ని షేర్ చేశారు. దీనికి "#TheGirlfriend. Mandatory Watch" (తప్పకుండా చూడాలి) అని క్యాప్షన్ జోడించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామాలో రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ప్రస్తుతం జాన్వీ కపూర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' అనే భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె 'అచ్చియమ్మ' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల మైసూర్‌లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఏకంగా 1000 మంది డ్యాన్సర్లతో ఓ భారీ పాటను చిత్రీకరించారు. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా 2026 మార్చి 27న 'పెద్ది' చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Janhvi Kapoor
Rashmika Mandanna
The Girlfriend movie
Rahul Ravindran
Ram Charan
Peddi movie
Achiyamma character
Telugu cinema
Bollywood
Vriddhi Cinemas

More Telugu News