Nandamuri Balakrishna: బాలయ్య బాబుకి భక్తి ఎక్కువ: మురళీమోహన్

Murali Mohan Interview
  • బాలయ్యకి క్రమశిక్షణ ఎక్కువన్న మురళీమోహన్
  • రామారావుగారి నుంచి వచ్చిందని వెల్లడి
  • రాహుకాలంలో ఆయన బయల్దేరడని వ్యాఖ్య    
  • ఆయన క్రేజ్ పెరుగుతూ వెళుతుందంటూ ప్రశంసలు

కథానాయకుడిగా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా .. మురళీ మోహన్ అనేక సినిమాలలో నటించారు. రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఆయన, ఆ తరువాత రియల్ ఎస్టేట్ బిజినెస్ లోను నమ్మకాన్ని సంపాదించుకున్నారు. ఒక వైపున వ్యాపార వ్యవహారాలను చూసుకుంటూనే, తనకి నచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళుతున్నారు. అలాంటి ఆయన తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'అఖండ 2' గురించి ప్రస్తావించారు. 

"బాలకృష్ణగారితో నేను చేసిన మొదటి సినిమా 'అమ్మదమ్ముల అనుబంధం'. అప్పటి నుంచి కూడా మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆయన చేసిన 'అఖండ' సినిమా రిలీజ్ సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. ఇక్కడ మాదిరిగానే అక్కడి థియేటర్స్ లో కూడా అభిమానులు సందడి చేయడం .. పేపర్లు చింపి విసిరేయడం చూశాను. ఆయన వరుస హిట్స్ తో ముందుకు వెళుతుండటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. 'అఖండ 2' సినిమాలో హీరో గురువు పాత్రకి నన్ను సిఫార్స్ చేసింది బాలయ్యనే" అని అన్నారు. 

"బాలకృష్ణ గారు చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. ఎన్టీ రామారావుగారి మాదిరిగానే ఆయన తెల్లవారు జామునే నిద్రలేస్తారు. వాకింగ్ చేస్తారు .. జిమ్ చేస్తారు. ఆయనకి భక్తి ఎక్కువ .. పూజ చాలా సేపు చేస్తారు. ఇవన్నీ కూడా 5 గంటలలోపే పూర్తి చేస్తారు. షూటింగుకు ముందుగా వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి .. ఆలస్యంగా మాత్రం రారు. రాహుకాలంలో ఎక్కడికీ బయల్దేరరు. ఆయన చాలా సరదాగా ఉంటారు. తాను చేస్తున్న పనికి ఎవరైనా అంతరాయం కల్పిస్తే మాత్రం చిరాకు పడతారు"అని చెప్పారు. 

Nandamuri Balakrishna
Balakrishna
Murali Mohan
Akhanda 2
Telugu Cinema
Tollywood
Hinduism
NTR
Telugu actors
cinema news

More Telugu News