Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు... రేవంత్ రెడ్డి విహంగ వీక్షణం

Revanth Reddy Oversees Telangana Rising Global Summit Preparations
  • ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు
  • ఉత్తమ్, కోమటిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే
  • 100 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ఆర్థిక సదస్సు
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' జరగనుంది. ఈ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు.

ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ అంతర్జాతీయ ఆర్థిక సదస్సును నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు తరలి వస్తారు.

గ్లోబల్ సదస్సు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినదని, తమ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గ్లోబల్ సమ్మిట్ వివరాలను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన మీడియాకు వివరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో 27 సెషన్లు ఉంటాయని, వివిధ రంగాల నిపుణులు, నిష్ణాతులను ఆహ్వానించినట్లు వెల్లడించారు.

ఎయిర్‌లైన్స్ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమిట్‌కు వివిధ దేశాల ప్రతినిధులు భారీ సంఖ్యలో వస్తారని వెల్లడించారు. ముఖ్య అతిథులకు సమస్య వస్తే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇలాంటి సదస్సు గతంలో ఎన్నడూ జరగలేదని భట్టివిక్రమార్క అన్నారు.
Revanth Reddy
Telangana Rising Global Summit
Telangana
Uttam Kumar Reddy
Komatireddy Venkat Reddy

More Telugu News