France car accident: ఫ్రాన్స్‌లో క్రిస్మస్ వేడుకలపై కారు బీభత్సం.. 10 మంది దుర్మరణం

France Car Accident Kills 10 at Christmas Celebration in Guadeloupe
  • గ్వాడెలోప్‌లోని సెయింట్-ఆన్‌లో జనం పైకి దూసుకెళ్లిన కారు
  • డ్రైవర్‌కు అనారోగ్యం కారణంగానే ప్రమాదం జరిగిందని అనుమానం
  • గతేడాది జర్మనీలోనూ క్రిస్మస్ మార్కెట్‌లో ఇలాంటి ఘటన
ఫ్రాన్స్‌లో క్రిస్మస్ పండుగకు ముందు ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఫ్రాన్స్ ఓవర్సీస్ రీజియన్ అయిన గ్వాడెలోప్‌లోని సెయింట్-ఆన్‌లో క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లలో ఉన్న జనసమూహంపైకి ఒక కారు దూసుకెళ్లింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 10 మంది మరణించగా, మరో 9 మంది గాయపడ్డారు.

సెయింట్-ఆన్‌లోని టౌన్ హాల్, చర్చి ఎదురుగా ఉన్న షోల్చర్ స్క్వేర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, డ్రైవింగ్ చేస్తున్న సమయంలో డ్రైవర్‌కు అకస్మాత్తుగా అనారోగ్య సమస్య తలెత్తడం వల్లే వాహనం అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ వాదనను అధికారులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రమాదం తర్వాత డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోకుండా అక్కడే ఉన్నట్లు తెలిసింది.

గతేడాది జర్మనీలోనూ క్రిస్మస్ పండుగకు కొన్ని రోజుల ముందు ఇలాంటి ఘటనే జరిగింది. మాగ్డెబర్గ్‌ నగరంలోని క్రిస్మస్ మార్కెట్‌లోకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మరణించగా, 68 మంది గాయపడ్డారు.
France car accident
Guadeloupe
Christmas celebrations
Saint-Anne
car crash
France news
road accident
Christmas market accident
Magdeburg
overseas region

More Telugu News