PM Modi: రష్యా పౌరులకు 30 రోజుల ఉచిత ఈ-వీసా... ప్రధాని మోదీ కీలక ప్రకటన
- త్వరలో గ్రూప్ టూరిస్ట్ వీసా కూడా అందుబాటులోకి
- ఢిల్లీలో పుతిన్‌తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ప్రకటన
- ఇరు దేశాల మధ్య ప్రజా సంబంధాలే కీలకమన్న ప్రధాని
- రష్యాలో ఇటీవల రెండు కొత్త భారత కాన్సులేట్ల ఏర్పాటు
భారత్, రష్యా మధ్య సాంస్కృతిక, ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా పౌరులకు 30 రోజుల పాటు ఉచిత ఈ-టూరిస్ట్ వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసాను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో ప్రజల మధ్య సంబంధాలకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని మోదీ అన్నారు. "దశాబ్దాలుగా ఇరు దేశాల ప్రజల మధ్య లోతైన ఆప్యాయత, గౌరవం, అభిమానం ఉన్నాయి. ఈ బంధాలను మరింతగా పటిష్టం చేయడానికి పలు కొత్త చర్యలు తీసుకుంటున్నాం" అని ఆయన పేర్కొన్నారు. ఈ సంబంధాలను మరింత సులభతరం చేసేందుకు ఇటీవల రష్యాలో రెండు కొత్త భారత కాన్సులేట్లను (యెకాటెరిన్‌బర్గ్, కజాన్) ప్రారంభించినట్లు గుర్తుచేశారు.
అలాగే మానవ వనరుల మార్పిడికి సంబంధించి రెండు ఒప్పందాలు కుదిరినట్లు ప్రధాని తెలిపారు. "మానవ వనరుల మార్పిడి మన ప్రజలను కలపడమే కాకుండా, ఇరు దేశాలకు కొత్త బలాన్ని, అవకాశాలను సృష్టిస్తుంది. వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ వంటి అంశాలలో కలిసి పనిచేస్తాం. విద్యార్థులు, మేధావులు, క్రీడాకారుల మధ్య పరస్పర పర్యటనలను కూడా పెంచుతాం" అని మోదీ వివరించారు.
గత అక్టోబర్‌లో రష్యాలోని కల్మీకియాలో ప్రదర్శనకు ఉంచిన గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలను లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక బంధానికి నిదర్శనమని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.