Huzurabad: హుజూరాబాద్‌లో విషాదం... ఉరేసుకున్న బీటెక్ విద్యార్థి

Huzurabad BTech Student Abhilash Found Dead by Suicide
  • హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలో విషాద ఘటన
  • ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి అభిలాష్
  • మృతుడు కిట్స్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్థానికుల కథనం ప్రకారం... సిర్సపల్లికి చెందిన కొక్కొండ రమేశ్‌-రజిత దంపతుల పెద్ద కుమారుడు అభిలాష్ (19) సింగాపురం కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఇంట్లోని బాత్రూంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కొంతసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అభిలాష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కుమారుడి ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Huzurabad
Abhilash
B.Tech Student
Sirsapalli
Karimnagar
KITS Singapuram
Suicide
Engineering Student
Student Suicide
Telangana News

More Telugu News