KL Rahul: ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు వేగంగా ఆడాలో కేఎల్ రాహుల్‌కు తెలుసు: డేల్ స్టెయిన్

KL Rahul Knows When to Slow Down Says Dale Steyn
  • అతను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే కచ్చితంగా శతకాలు సాధిస్తాడని ధీమా
  • కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో బాగా తెలుసని ప్రశంస
  • ప్రస్తుతం ఆడుతున్న స్థానాల్లో ఎలాంటి పాత్ర పోషించాలో కూడా తెలుసని వ్యాఖ్య
టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు నెమ్మదిగా ఆడాలో, ఎప్పుడు వేగంగా ఆడాలో బాగా తెలుసని దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అన్నాడు. బ్యాటింగ్‌లో నిలకడ ప్రదర్శిస్తున్న అతడిపై ప్రశంసలు కురిపించాడు. కేఎల్ రాహుల్‌కు ఎలా ఆడాలో బాగా తెలుసని, ఒకవేళ అతను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే కచ్చితంగా సెంచరీలు సాధించగలడని అభిప్రాయపడ్డాడు.

అదే సమయంలో ప్రస్తుతం అతడు ఆడుతున్న స్థానాల్లో జట్టు కోసం తాను ఎలాంటి పాత్ర పోషించాలో కూడా తెలుసని పేర్కొన్నాడు. రెండు వన్డేలలో అతడు అర్ధ శతకాలు సాధించాడని స్టెయిన్ గుర్తుచేశాడు. ఎప్పుడు ఎలా ఆడాలనే విషయంపై అతడికి ఒక అవగాహన ఉందని తెలిపాడు.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపొందింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలతో రాణించాడు. మొదటి వన్డేలో 56 బంతుల్లో 60 పరుగులు, రెండో వన్డేలో 43 బంతుల్లో 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
KL Rahul
Dale Steyn
India vs South Africa
ODI Series
Cricket
Indian Cricket Team
South Africa Cricket Team
Batting
Half Centuries

More Telugu News