Danam Nagender: రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం: దానం నాగేందర్

If Revanth orders i will resign says Danam Nagender
  • ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాడటం తనకు కొత్త కాదని వ్యాఖ్య
  • ఎమ్మెల్యేల అనర్హత కేసు సుప్రీంకోర్టులో కొనసాగుతోందని వెల్లడి
  • మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న దానం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై సమాధానం ఇచ్చేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను మరింత గడువు కోరిన కొన్ని రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాడటం తనకు కొత్తేమీ కాదని అన్నారు. తాను ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికల బరిలో నిలిచానని గుర్తుచేశారు. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగాలని దానం నాగేందర్ ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు.  
Danam Nagender
Revanth Reddy
Telangana Politics
MLA Resignation
Telangana Development
Gadadam Prasad Kumar
Supreme Court
Telangana Elections
Party Defection

More Telugu News