Joe Root: నగ్న ప్రదర్శన శపథం నుంచి హేడెన్‌ను కాపాడిన జో రూట్!

Joe Root Saves Matthew Hayden From Naked Walk After Ashes Century
  • ఆసీస్ గడ్డపై తొలి టెస్టు శతకం సాధించిన జో రూట్
  • రూట్ సెంచరీ చేయకపోతే నగ్నంగా తిరుగుతానన్న మాథ్యూ హేడెన్
  • ఆ శపథం నుంచి తన తండ్రిని కాపాడావంటూ రూట్‌కు హేడెన్ కుమార్తె థ్యాంక్స్
  • అభినందనలు మిత్రమా అంటూ రూట్‌కు వీడియో సందేశం పంపిన హేడెన్
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్భుత శతకంతో మెరిశాడు. ఆస్ట్రేలియా గడ్డపై అతడికి ఇదే తొలి టెస్ట్ సెంచరీ కావడం విశేషం. అయితే, ఈ సెంచరీ రూట్‌కు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో, ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మాథ్యూ హేడెన్‌కు అంతకుమించిన ఊరటను ఇచ్చింది. రూట్ సెంచరీ చేయడంతో, హేడెన్ ఓ సంచలన శపథం నుంచి బయటపడ్డాడు.

ఈ యాషెస్ సిరీస్‌లో రూట్ కనీసం ఒక సెంచరీ అయినా చేయకపోతే, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) చుట్టూ నగ్నంగా నడుస్తానని హేడెన్ గతంలో ఒక యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో ప్రకటించాడు. దీంతో ఈ సిరీస్‌లో రూట్ ప్రదర్శనపై అందరిలో ఆసక్తి నెలకొంది. రూట్ సెంచరీ చేయగానే హేడెన్ కుమార్తె గ్రేస్ స్పందిస్తూ "మా కళ్లను కాపాడినందుకు థ్యాంక్యూ రూట్" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

    
శతకం సాధించిన రూట్‌ను హేడెన్ స్వయంగా అభినందించాడు. "ఆస్ట్రేలియాలో సెంచరీ చేసినందుకు కంగ్రాట్స్ మిత్రమా. దీనికోసం చాలా సమయం తీసుకున్నావు. ఈ విషయంలో నాకంటే ఎక్కువ రిస్క్ ఎవరూ తీసుకోలేదు. నీ శతకాన్ని మనస్ఫూర్తిగా కోరుకున్నా. బాగా ఎంజాయ్ చేయి" అని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో తన తొలి సెంచరీని రూట్ 181 బంతుల్లో పూర్తి చేశాడు. ఇది అతడికి టెస్టుల్లో 40వ శతకం. ఆసీస్ గడ్డపై శతకం చేయడానికి రూట్‌కు 30 ఇన్నింగ్స్‌లు పట్టింది.
Joe Root
Matthew Hayden
Ashes Series
England Cricket
Melbourne Cricket Ground
Test Century
Cricket
Grace Hayden
Australia
Naked Walk

More Telugu News