Chandrababu Naidu: ఏపీలో ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఫీజులు ఖరారు

Chandrababu Naidu Approves Fees for AP Medical Colleges PG Courses
  • ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ ఫీజులు ఖరారు
  • ప్రభుత్వ కోటా సీట్లకు రూ. 30 వేలుగా నిర్ణయం
  • సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లకు రూ. 9 లక్షల ఫీజు
  • ఈ ఏడాది 60 పీజీ సీట్లను కేటాయించిన జాతీయ వైద్య మండలి
  • ఫీజుల నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర
ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ కోటా సీట్లకు వార్షిక ఫీజును రూ. 30 వేలుగా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా సీట్లకు రూ. 9 లక్షలుగా నిర్ధారించారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు వైద్య కళాశాలలకు ఈ విద్యా సంవత్సరం నుంచి 60 పీజీ సీట్లను జాతీయ వైద్య మండలి (NMC) కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సీట్లకు సంబంధించి ఫీజుల ఖరారుపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించిన విధానంలో ఫీజులను సమీక్షించి ఈ తుది నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదంతో ఫీజుల ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఏడాది నుంచే కొత్త పీజీ సీట్లలో ప్రవేశాలకు మార్గం సుగమమైంది. 
Chandrababu Naidu
Andhra Pradesh
AP Medical Colleges
PG Courses
Government Medical Colleges
NMC
Medical Education
Satya Kumar Yadav
AP PG Fees

More Telugu News