Indigo: ఇండిగో దెబ్బ.. న్యూయార్క్ కంటే ముంబై టికెట్ ధరే ఎక్కువ!

Indigo Crisis Mumbai Flight More Expensive Than New York
  • ఇండిగోలో తీవ్ర సంక్షోభం.. 550కి పైగా విమానాలు రద్దు
  • టికెట్ ధరల మోతతో ప్రయాణికులపై పెను భారం
  • న్యూయార్క్ కంటే ముంబై ప్రయాణానికే అధిక చార్జీల వసూలు
దేశీయ విమానయాన రంగంలో అతిపెద్ద సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభం ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతోంది. విమాన టికెట్ ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లేందుకు అయ్యే ఖర్చు కన్నా.. ముంబై వెళ్లేందుకే ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు విమాన టికెట్ ధర రూ.36,668 ఉండగా, ఢిల్లీ నుంచి ముంబైకి రూ.40,452కి చేరడం గమనార్హం.

ఇండిగోలో అంతర్గత సమస్యల కారణంగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 550కి పైగా సర్వీసులను రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే 72, బెంగళూరులో 73, చెన్నైలో 39 సర్వీసులు ఉన్నాయి. ఉన్నపళంగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాశ్రయాల్లో గంటల తరబడి పడిగాపులు కాస్తూ, సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు.

ఈ పరిస్థితిని ఇతర విమానయాన సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి టికెట్ ధర రూ.30 వేలు దాటింది. ఢిల్లీ నుంచి విజయవాడకు ఎయిర్ ఇండియా విమాన టికెట్ ధర రూ.34,987గా ఉంది. సాధారణంగా రూ.6-10 వేల మధ్య ఉండే ధరలు ఇంత భారీగా పెరగడంతో అత్యవసర ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
Indigo
Indigo flights
flight cancellations
India flight prices
Mumbai flight ticket price
New York flight ticket price
Hyderabad flights
Delhi flights
Air India
Vijayawada flights

More Telugu News