Lalo Krishna Sada Sahayate: ఎక్కడ 50 లక్షలు .. ఎక్కడ 100 కోట్లు ..!
- గుజరాతీ సినిమా సంచలనం
- 50 లక్షలతో నిర్మించిన సినిమా
- ప్రమోషన్స్ లేకుండానే రిలీజ్
- మౌత్ టాక్ తో దూసుకుపోయిన కంటెంట్
- 54 రోజుల్లో 100 కోట్లకి పైగా వసూళ్లు
సాధారణంగా మలయాళ సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందుతూ ఉంటాయి .. భారీ వసూళ్లను రాబడుతూ ఉంటాయి. క్రితం ఏడాది .. ఈ ఏడాదిలోనూ ఈ విషయంలో మలయాళ ఇండస్ట్రీ ముందే ఉంది. తక్కువ పాత్రలతో రూపొందిన చిన్న సినిమాలు .. తక్కువ బడ్జెట్ లో చేసిన సినిమాలు .. స్టార్స్ ప్రస్తావన లేని సినిమాలు అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేస్తూ వచ్చాయి. అలాంటి మేజిక్ ఇప్పుడు ఓ గుజరాతీ సినిమా చేయడం హాట్ టాపిక్ గా మారింది.
గుజరాతీ సినిమాలను చాలా తక్కువ బడ్జెట్ లోనే నిర్మిస్తూ ఉంటారు. అయితే వసూళ్ల పరంగా అన్ని ఇండస్ట్రీల దృష్టిని ఆకర్షించే ఘట్టాలు అప్పుడప్పుడు మాత్రమే చోటుచేసుకుంటూ వచ్చాయి. అలా ఇప్పుడు ఒక గుజరాతీ సినిమాను గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన ఆ సినిమా పేరే 'లాలో: కృష్ణ సదా సహాయతే'. రీవా రచ్ .. సృహద్ గోస్వామి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమానే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మానసి పరేఖ్ - పృథ్వీ గోహిల్ నిర్మించిన ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా కోసం కొన్ని కోట్లు ఖర్చు చేశారని అనుకుంటే పొరపాటే, కేవలం 50 లక్షలతో ఈ సినిమాను నిర్మించారు. ప్రమోషన్స్ పెద్దగా లేకుండా .. ఏ మాత్రం అంచనాలు లేకుండా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నీరసంగా మొదలైన వసూళ్లు .. 100 కోట్లు దాటిన తరువాత గానీ తగ్గలేదు. కేవలం మౌత్ టాక్ తోనే ఈ రికార్డు దక్కింది. కంటెంట్ ఉంటే చాలు అనే మాటను మరోసారి నిరూపించిన సినిమా ఇది.