KL Damodar Prasad: ఐ-బొమ్మ రవి చేసింది తప్పే... దొంగతనమే కాదు ఆ వస్తువులు కొనడమూ తప్పే: ప్రముఖ నిర్మాత

KL Damodar Prasad says IBomma Ravi is wrong
  • ఐ-బొమ్మ రవిని హీరోగా క్రియేట్ చేయడం తప్పన్న కేఎల్ దామోదర ప్రసాద్
  • ఏడాదికి 200కు పైగా సినిమాలు వస్తున్నాయి... ధరలు పెరిగేవి ఐదారు మాత్రమేనని వెల్లడి
  • పైరసీ సినిమాలు చూడటం మానివేయాలని విజ్ఞప్తి
  • శుక్రవారం పెంచిన టిక్కెట్ ధరలు సోమవారానికి తగ్గించే పరిస్థితి ఉందని ఆవేదన
ఐ-బొమ్మ రవిని హీరోగా చూడటం సరికాదని, అతను చేసింది కచ్చితంగా తప్పేనని ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ అన్నారు. దొంగతనం చేయడం ఎంత తప్పో, దొంగ వస్తువులు కొనుగోలు చేయడం కూడా అంతే తప్పని ఆయన పేర్కొన్నారు. సంవత్సరానికి 200కు పైగా సినిమాలు వస్తున్నప్పటికీ, టిక్కెట్ల ధరలు పెరిగేవి కేవలం ఐదారు సినిమాలకు మించి ఉండవని అన్నారు.

మిగిలిన సినిమాల టిక్కెట్ ధరలు పెరగకపోయినా పైరసీ ఆగడం లేదని ఆయన వెల్లడించారు. ఐ-బొమ్మ రవి చేసింది తప్పని, పైరసీ సినిమాలు చూడటం మానేయాలని కోరారు. పరిస్థితులు త్వరలో మారతాయని, అందుకు అనుగుణంగా చట్టాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

సినిమా పరిశ్రమను కాపాడుకోవాలని ఆయన అన్నారు. టిక్కెట్ రేట్లు పెంచే అంశాన్ని ఛాంబర్ కూడా ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. ప్రజలు థియేటర్‌లకు రాకపోవడం వల్ల శుక్రవారం పెంచిన టిక్కెట్ ధరలను సోమవారం తగ్గించే పరిస్థితి వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
KL Damodar Prasad
I-Bomma Ravi
Telugu cinema
Movie piracy
Ticket prices
Film industry

More Telugu News