Akhanda 2: బాలయ్య సినిమాకు బూస్ట్.. తెలంగాణలో 'అఖండ 2' టికెట్ ధరల పెంపు

Akhanda 2 Telangana Ticket Price Hike Approved by Government
  • 'అఖండ 2' టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం 
  • సింగిల్ స్క్రీన్‌పై రూ. 50, మల్టీప్లెక్స్‌లో రూ. 100 అదనపు చార్జీ
  • విడుదలైన మొదటి మూడు రోజులు మాత్రమే ఈ పెంపు వర్తింపు
  • అభిమానుల కోసం ఇవాళ‌ ప్రత్యేక ప్రీమియర్ షో
  • స్పెషల్ షో టికెట్ ధర రూ. 600గా ఖరారు
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన‌ 'అఖండ 2' చిత్రానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలకు అనుమతి ఇస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి టికెట్‌పై అదనంగా రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 వరకు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే, పెంచిన ఈ ధరలు సినిమా విడుదలైన తొలి మూడు రోజులు మాత్రమే అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అలాగే బాలకృష్ణ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రీమియర్ షోను ప్రదర్శించడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. ఇవాళ రాత్రి 8 గంటలకు ఈ స్పెషల్ షోను ప్రదర్శించనున్నారు. ఈ ప్రత్యేక షో కోసం టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ. 600గా నిర్ణయించారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ భారీ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ప్రభుత్వ అనుమతితో సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెరగనున్నాయి.
Akhanda 2
Nandamuri Balakrishna
Balakrishna movie
Boyapati Srinu
Telangana
Akhanda 2 ticket prices
Telugu cinema
Movie ticket hike
Akhanda 2 release
Single screen theaters

More Telugu News