Rashmika Mandanna: విజయ్‌తో పెళ్లి వార్తలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు.. ఖండించలేనన్న బ్యూటీ!

Rashmika Mandanna on Vijay Deverakonda Wedding Rumors No Denial
  • పెళ్లి రూమర్స్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఆ వార్తలను ధ్రువీకరించను, ఖండించనన్న రష్మిక
  • వ్యక్తిగత జీవితం గురించి బయట మాట్లాడలేనని వెల్లడి
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఈ రూమర్స్‌పై రష్మిక స్పందించారు. తాజాగా ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చాయి.

ఈ వార్తలను తాను ఖండించలేనని, అలాగని ధ్రువీకరించలేనని రష్మిక తెలివిగా సమాధానమిచ్చారు. "నేను ఈ వార్తలను ఇప్పుడే ధ్రువీకరించలేను. అలాగని వీటిని ఇప్పుడు ఖండించనూ లేను. పెళ్లి గురించి సరైన సమయంలో, సరైన చోట మాట్లాడతాను. ఆ వివరాలను కచ్చితంగా అందరితో పంచుకుంటాను. అంతకుమించి ఇప్పుడేమీ చెప్పలేను" అని ఆమె పేర్కొన్నారు.

తన వ్యక్తిగత జీవితం గురించి బయట మాట్లాడటం ఇష్టం ఉండదని రష్మిక స్పష్టం చేశారు. పర్సనల్ లైఫ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటానని, ఇంట్లో పని గురించి, బయట వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించనని తెలిపారు.

ఇదే ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ, ఈ ఏడాది తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. "ఈ ఏడాది నా ఐదు సినిమాలు విడుదలై మంచి ఆదరణ పొందాయి. భాష, జానర్ వంటి హద్దులు లేకుండా అన్ని రకాల పాత్రలు చేయాలని ముందునుంచీ అనుకున్నాను. నా విభిన్న పాత్రలను చూసి ప్రేక్షకులు ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది" అని రష్మిక వివరించారు.
Rashmika Mandanna
Vijay Deverakonda
Rashmika Vijay Wedding
Telugu Cinema
Tollywood
Celebrity Wedding Rumors
Indian Actress
Bollywood
Entertainment News
Film Industry

More Telugu News