Samantha Ruth Prabhu: సమంత, రాజ్‌ల పెళ్లి సంగతులు చెప్పిన స్నేహితురాలు

Samantha Raj Wedding Details Shared by Friend
  • రాజ్ మౌనంగా ఉంటే, సమంత చలాకీగా ఉంటారన్న శిల్పారెడ్డి
  • ఇలాంటి వివాహ వేడుకను ఎప్పుడూ చూడలేదన్న శిల్పారెడ్డి
  • ఈ వివాహ వేడుక గొప్ప అనుభూతిని మిగుల్చుతుందని వ్యాఖ్య
ప్రముఖ సినీ నటి సమంత-రాజ్ నిడిమోరుల వివాహ విశేషాలను ఆమె స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అదే సమయంలో సమంతతో తనకున్న అనుబంధాన్ని కూడా తెలియజేశారు. సమంత, రాజ్ భిన్న ధ్రువాల్లాంటివారని, రాజ్ మౌనంగా ఉంటే, సమంత చలాకీగా ఉంటారని పేర్కొన్నారు. సమంత, రాజ్‌ల పెళ్లిలాంటి వేడుకను తాను ఇదివరకు ఎప్పుడూ చూడలేదని తెలిపారు.

ఒక్కో కుటుంబం నుంచి, వారి గురించి పూర్తిగా తెలిసిన వారు పదిమంది చొప్పున వచ్చినట్లు వెల్లడించారు. సినిమా పరిశ్రమ నుంచి నందిని రెడ్డి వచ్చినట్లు తెలిపారు. వివాహం ఎంతో సాధారణంగా జరిగిందని వెల్లడించారు. అగ్ని ముందు వధువు వేలికి, వరుడు వేలికి సూత్రాన్ని ధరించే విధానాన్ని చూసి తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని అన్నారు. ఆ సమయంలో వారి మధ్య ఏదో శక్తి ఉద్భవించినట్లుగా అనిపించిందని పేర్కొన్నారు.

అతిథులందరికీ ఈ వివాహ వేడుక గొప్ప అనుభూతిని మిగుల్చుతుందని అన్నారు. సమంతతో తనకున్న అనుబంధాన్ని కూడా ఆమె పంచుకున్నారు. ఒకరిపై ఒకరం వ్యంగ్యాస్త్రాలు విసురుకుంటామని, ఒకరిని మరొకరం ఏడిపించుకుంటామని అన్నారు. సమంత ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిందని అన్నారు.
Samantha Ruth Prabhu
Samantha marriage
Raj Nidimoru
Shilpa Reddy
Samantha wedding

More Telugu News