Ruturaj Gaikwad: రుతురాజ్, కోహ్లీ సెంచరీలు వృథా.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం

Ruturaj Kohli Centuries in Vain South Africa Wins Second ODI
  • తొలుత బ్యాటింగ్ చేసి 358 పరుగులు చేసిన భారత జట్టు
  • 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా
  • సిరీస్ 1-1తో సమం.. డిసెంబర్ 6న నిర్ణయాత్మక మ్యాచ్
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 105 పరుగులు), విరాట్ కోహ్లీ (93 బంతుల్లో 102 పరుగులు) శతకాలతో రాణించారు. చివరలో కే.ఎల్. రాహుల్ 43 బంతుల్లో 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్ 98 బంతుల్లో 110 పరుగులు, మాథ్యూ బ్రిట్జ్కే 64 బంతుల్లో 68 పరుగులు, డెవాల్డ్ బ్రెవిస్ 34 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ డిసెంబర్ 6న విశాఖపట్నంలో జరగనుంది.
Ruturaj Gaikwad
Virat Kohli
South Africa
India vs South Africa
ODI Series
Aiden Markram

More Telugu News